శరీరంలో క్యాన్సర్ కణాల నియంత్రణలో బెండకాయ పాత్ర తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

అత్యధిక పోషక విలువలు కలిగిన బెండకాయను ఇంగ్లీషులో లేడీ ఫింగర్ అని కూడా పిలుస్తారు. బెండకాయతో ఫ్రై, పచ్చడి, కర్రీస్, సాంబార్ వంటి ఎన్నో రుచికరమైన వంటకాలను తయారు చేసుకొని తినొచ్చు.మనలో చాలామంది లేత పచ్చి బెండకాయను తినడానికి ఇష్టపడతారు. పచ్చి బెండకాయ ను ఆహారంగా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి బెండకాయను ఆహారంగా తీసుకోవడంతో పాటు ప్రతిరోజు పచ్చి బెండకాయను తింటే ఇందులో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. బెండకాయలు సమృద్ధిగా ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసి మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. బెండకాయను తరుచూ తినడం వల్ల ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు ధమనుల్లో మరియు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి రక్త ప్రసరణ వేగవంతం చేస్తుంది తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండె జబ్బు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.

బెండకాయ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ గుణాల, యాంటీ క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా అన్ని రకాల క్యాన్సర్ల నుంచి జీవితకాలం పాటు రక్షణ పొందవచ్చు. పచ్చి బెండకాయను తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది తద్వారా రక్తపోటు, గుండెపోటు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. బెండలు సమృద్ధిగా ఉన్న విటమిన్ కె, పొటాషియం ఐరన్ వంటి మూలకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడి ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచి అనీమియా వ్యాధి నుంచి మనల్ని రక్షిస్తుంది. అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు తరచూ బెండకాయను తింటే సహజ పద్ధతిలో శరీర బరువు తగ్గించుకొని ఉబకాయ సమస్య నుంచి బయటపడవచ్చు.