కలబంద చాలామంది కలబందను చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు.అయితే చాలామంది మార్కెట్లో దొరికే అలోవెరా జెల్స్ ఉపయోగిస్తూ ఉంటారు కానీ సహజ సిద్ధంగా లభించే ఈ అలోవెరా జెల్ తో మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పెంపొందించుకోవచ్చు. మన ఇంటి ఆవరణంలో పెరిగే ఈ కలబంద నుంచి తీసిన గుజ్జు ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందుకోవడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
కలబంద గుజ్జులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. కలబందలో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా ఉంచేందుకు ఎంతో బాగా సహాయపడతాయి. కలబంద జెల్ ను జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు ఎంతో ఒత్తుగా పెరుగుతుంది. ఈ గుజ్జు ద్వారా మొహంపై తరచూ మర్దన చేయడం వల్ల చర్మంపై ఉన్నటువంటి మృత కణాలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.ఈ విధంగా కలబంద ద్వారా ఎన్నో సౌందర్య ప్రయోజనాలను పెంపొందించుకోవచ్చు అయితే కలబంద గుజ్జు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
కలబందలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక మనకు మన శరీరంలో ఏదైనా గాయం తగిలితే ఆ గాయం పై ఈ కలబంద గుజ్జు రాయడం వల్ల తొందరగా నొప్పి నుంచి ఉపశమనం పొందటమే కాకుండా ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. ఇక ఎవరైతే టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు ఒక గ్లాస్ కలబంద రసం తాగటం వల్ల ఈ డయాబెటిస్ సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇలా కలబంద వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి.