రోజు గుప్పెడు మొలకెత్తిన పెసర గింజలు తింటే ఈ వ్యాధులకు వైద్యులతో పనేలేదు!

చిరు పప్పు ధాన్యాల్లో ఒకటైన పెసర గింజలను రోజువారి ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పెసలు ధాన్యంలో అత్యధిక ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.గుప్పెడు మొలకెత్తిన పెసర గింజలను ప్రతిరోజు ఉదయాన్నే ఆహారంగా తీసుకుంటే మొలకెత్తిన గింజల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

మొలకెత్తిన పెసర గింజల్లో డెంటరి ఫైబర్ , ప్రోటీన్స్ పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి కావున పోషకాహార లోపంతో బాధపడేవారు ప్రతిరోజు వీటిని నిక్షేపంగా తినొచ్చు.
రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో ఫైబర్ సహాయపడి కావున డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది మరియు రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తప్రసరణ వేగాన్ని పెంచి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.పొటాషియం , మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు నాడీ కణ వ్యవస్థను దృఢపరిచి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి.

అతి బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు గుప్పెడు మొలకెత్తిన పెసరు గింజలను ఆహారంగా తీసుకుంటే ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తరిగిపోయి సహజ పద్ధతిలో శరీర బరువును తగ్గించుకోవచ్చు.
పెసలు ప్రతిరోజు తినటం వల్ల హార్మోన్ల ఉత్పత్తిని
పెంచి జీవక్రియల వ్యత్యాసాన్ని తొలగిస్తుంది. రక్తహీనత సమస్య తో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన గింజలను తింటే ఐరన్ సమృద్ధిగా లభించి హిమోగ్లోగ్నిత్పత్తిని పెంచుతుంది తద్వారా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం, ఎసిడిటీ, ఫైల్స్ వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.