కాలంతో పోటీపడి పరిగెడుతున్న నేటి ఆధునిక యుగంలో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజువారీ కార్యకలాపాల్లో ఒత్తిడి, విశ్రాంతి తీసుకునే సమయం తగ్గడం, ఆర్థికపరమైన కారణాలు,కుటుంబ సమస్యలు, మద్యపానం ధూమపానం వంటి ఎన్నో కారణాలు మనల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి దాంతో డిప్రెషన్, అల్జీమర్, గుండెపోటు, రక్తపోటు, ఉబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే రోజువారీ తీసుకునే ఆహారం విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలను పాటించాలి. ముఖ్యంగా మనలో చాలామంది తీవ్రమైన ఒత్తిడి సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. అదే మనందరం చేసే పొరపాటు. కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్ వంటి పానీయాల్లో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రలేమి లేని సమస్యలు పెంచుతుంది. అలాగే గుండె వేగాన్ని పెంచి గుండెపోటు, రక్తపోటు కి కారణం అయ్యి ఒత్తిడిని మరింత పెంచుతాయి.
సాధారణంగా మనం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మరింత పెంచి అలసట, నీరసం వంటి లక్షణాలను కలిగిస్తుంది. తద్వారా మనలో ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కావున చక్కెర నిల్వలు అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు.
అధికంగా మద్యం సేవించే వారిలో మానసిక ప్రశాంతతకు కారణమయ్యే సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గి డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున డిప్రెషన్, టెన్షన్, ఒత్తిడి నుంచి బయటపడడానికి మద్యపానానికి బానిస కావొద్దు. ప్రతిరోజు జంక్ ఫుడ్ ను అధికంగా తింటే ఒంట్లోకి అధిక కేలరీలు చేరి శరీర బరువు పెరుగుతుంది తద్వారా అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతాయి దాంతో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.