మానవ శరీరంలో నాడీ వ్యవస్థ అనేది అవయవాలతో ముడిపడి ఉంటుంది. నరాల బలహీనత అనేది ప్రజలు తరచుగా విస్మరించే ప్రధాన సమస్య. శరీరంపై ఒత్తిడి, శరీరంపై గాయాలు, అనారోగ్యకరమైన ఆహారం, మందులు, అంటు వ్యాధులు, పోషకాహార లోపం వల్ల నరాల బలహీనత ఏర్పడే అవకాశం ఉంది.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న అవిసె గింజలు, సార్డినేస్, వాల్నట్, చియా గింజలు ఆహారంగా తీసుకుంటే నరాలలో పట్టుత్వం పెరుగుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల నరాల బలహీనత వస్తుంది కాబట్టి సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది ప్రతిరోజు ఉదయం 15 నుంచి 20 నిమిషాల వరకు సూర్యరశ్మిలో తిరగడం ద్వారా మెదడులోని నరాలు ఉత్తేజంగా మారి ఎటువంటి సమస్య ఉండదు.
మధ్యాహ్నం పూట చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉదయం మాత్రమే సూర్యరశ్మిని గ్రహించాలి.రోజు వ్యాయామం చేయండి. జాగింగ్ లేదా అరగంట నడవడం వల్ల నరాల బలహీనత సమస్య మెరుగుపడుతుంది. నాడీ మరియు మానసిక రుగ్మతల నుండి కోలుకోవడం ఆశాజనకంగా ఉంటుంది. సీఫుడ్ లో విటమిన్లు,ఖనిజాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు ఇంకా అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుంది.
ఇంకా చేపకు నూనె కూడా లభిస్తుంది. వీటి ద్వారా కూడా నరాల బలహీనత తగ్గుతుంది. కాబట్టి చేపలు, పీతలు, ఎండ్రకాయలు, రొయ్యలు మంచి ఫలితం ఇస్తాయి. జియా గింజలు, అవిస గింజలు, గుమ్మడికాయ గింజలలో ఫిలోనిక్ సమ్మేళనాలు, ఇలాంటి, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ విత్తనాలను కూరలలో లేదా జ్యూస్ల రూపంలో కూడా తీసుకోవచ్చు.
చెప్పులు లేకుండా ఉదయం పూట గడ్డి, తేమ నేల, ఇసుకలో ఒక 30 నిమిషాల పాటు నడిచినట్లయితే పాదాలలోని నరాలు ప్రతిస్పందన చెంది ఆరోగ్యంగా ఉంటాయి. మంట, నొప్పి లాంటివి ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ ఎక్కువగా కాకుండా ఒక మోతాదులో తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది.