బ్లడ్ షుగర్ సమస్యతో బాధ పడుతున్నారా.. సమస్యకు చెక్ పెట్టే దివ్యౌషధాలు ఇవే!

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఆహారం, వ్యాయామం, హైడ్రేషన్ వంటి విషయాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. చక్కెర ఆహారాలు, పానీయాలు, ఉప్పగా ఉండే ఆహారాలను తగ్గించడం ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు, గింజలు, మొక్కల ఆధారిత ప్రోటీన్లు, చేపలు, సముద్ర ఆహారం వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా షుగర్ దూరం అవుతుంది. జోడించిన చక్కెరలను తగ్గించడం ద్వారా బ్లడ్ షుగర్ సమస్య శాశ్వతంగా కంట్రోల్ లో ఉంటుంది. సాధారణ కార్బోహైడ్రేట్‌లను సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లతో భర్తీ చేయడం ద్వారా బ్లడ్ షుగర్ సమస్య కంట్రోల్ లో ఉంటుంది. తరచుగా నడక వంటి సున్నితమైన, క్రమమైన వ్యాయామం చేయాలి.

తగినంత శారీరక శ్రమ చేయడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఇన్సులిన్ ఉపయోగిస్తుంటే, మీ మోతాదును సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. టాబ్లెట్స్, ఇన్సులిన్ ద్వారా షుగర్ ను సులువుగానే కంట్రోల్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాల్చిన చెక్క వాడటం ద్వారా షుగర్ సులువుగానే దూరమవుతుంది.

దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంతో పాటు రక్తంలోని గ్లూకోజ్ ను శరీరం ఎక్కువగ వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ను తగ్గించడంలో దాల్చిన చెక్కకు ఏదీ సాటిరాదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. షుగర్ తో బాధ పడేవాళ్లు ఐరన్, బీ12 తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.