కళ్ళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే మీరు డయాబెటిస్ వ్యాధి ప్రమాదంలో పడినట్లే!

red-eye-1024x682

డయాబెటిస్ లేదా మధుమేహం వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధి బారిన పడ్డామన్న విషయం చాలామందికి తెలిసేలోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. డయాబెటిస్ చాప కింద నీరులా శరీరంలో ఒక్కో అవయవాన్ని క్షీణింప చేస్తూ చివరికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుంది. మనం డయాబెటిస్ వ్యాధి బారిన పడ్డామన్న సంకేతాలు మొదట కళ్ళు ,కిడ్నీలో స్పష్టంగా కనిపిస్తాయి.

కళ్ళల్లో మరియు కంటి చూపులో వచ్చే కొన్ని మార్పుల కారణంగా డయాబెటిస్ వ్యాధిని మొదట్లోనే గుర్తించవచ్చు. చిన్న వయస్సులోనే కంటి చూపు మందగించడం లేదా స్పష్టంగా చూడలేకపోవడం, దూరంగా ఉన్న వస్తువులు లేదా దగ్గరగా ఉన్న వస్తువుల పరిసరాలను సరిగా గుర్తించలేకపోవడం,క‌ళ్ల‌తో చూస్తున్న‌ప్పుడు చూపులో న‌ల్ల‌ని గీత‌లు, మ‌చ్చ‌లు క‌నిపించ‌డం, ఒకే రంగు కు చెందిన భిన్న రకాల షేడ్స్ గుర్తించలేకపోవడం,కాంతి తక్కువ‌గా ఉన్న ప్ర‌దేశంలో వ‌స్తువుల‌ను చూస్తుంటే క‌ళ్లుకు ఒత్తిడికి కలగడం, కళ్ళపై ఒత్తిడి లేకపోయినా కళ్ళ వెంబడి నీరు కారణం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహాలు తీసుకోవాలి.

కొందరిలో పైన చెప్పిన లక్షణాలన్నీ డయాబెటిస్ వ్యాధి లక్షణాలు కావచ్చు. మరికొందరులో కంటికి సంబంధించిన అలర్జీలు, ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. ఏది ఏమైనా ఈ రోజుల్లో డయాబెటిస్ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంది కాబట్టి మన రోజువారి కార్యకలాపాల్లో మరియు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. డయాబెటిస్ వ్యాధి బారిన ఒకసారి పడితే జీవితకాలం నియంత్రించుకోవడం తప్ప పూర్తిగా బయటపడలేమన్న సంగతి గుర్తుంచుకోవాలి.