Diabetes: డయాబెటిస్ కంట్రోల్ కు ఇంటి చిట్కాలు.. కొన్ని..!

Diabetes: గతంలో ఒక వయసు దాటిన వారిని వేధించిన ‘డయాబెటిస్’కు ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. పురిట్లో బిడ్డకు కూడా షుగర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇందుకు కారణాలు అనేకం. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే ఇన్సులిన్ తగ్గుతుంది. ఇన్సులిన్ మన బాడీని, బ్లడ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోతే బీపీ, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా.. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ కాకుండా చూసుకోవడమే డయాబెటిస్ ఉన్నవారు చేయాల్సింది. కొన్ని రకాల ఆహార పదార్ధాలు, చిట్కాలు కూడా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి

పసుపు, ఉసిరి, కాకరకాయ: ఇవి బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. బర్ బెర్రీస్, పసుపు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. చిటికెడు పసుపు, ఉసిరికాయ గుజ్జును ముద్దగా చేసి మింగేయండి. ఇది చక్కగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.

దాల్చిన చెక్క: పసుపు తర్వాత అదే స్థాయిలో దాల్చిన చెక్క అదేస్థాయిలో పనిచేస్తుంది. షుగర్ పేషెంట్లలో తగ్గిపోయే ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ ఉంటే తగ్గించగలదు. అయితే.. దాల్చిన చెక్కను ఉపయోగించే మోతాదు గురించి డాక్టర్ సలహా తీసుకుంటే మంచిదే.

అవిసె గింజలు: వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి.

మెంతులు: వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. అనేక పరిశోధనల్లో నిరూపితమైంది కూడా.

మామిడి ఆకులు: మామిడి ఆకుల రసం తాగితే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అయితే.. మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

డయాబెటిస్ ఉన్నవారికి బెర్రీస్, దానిమ్మ, ఉసిరి వంటి కొన్ని పండ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. రోజుకో యాపిల్ తినవచ్చు. అందుకే డయాబెటిస్ పేషెంట్లు తీపి తక్కువగా తింటే బెటర్ అంటున్నారు డాక్టర్లు. కాకరకాయ రసం, నేరేడు రసం కలిపి తాగొచ్చు. ఇవన్నీ షుగర్ లెవెల్స్ పెరగడాన్ని అరికట్టి.. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయంటారు డాక్టర్లు. టీలో పంచదార కంటే తేనె తీసుకోవడం ఉత్తమం.