Yoga: వారానికో గంటైనా ‘యోగా’ చేస్తే.. ఈ రుగ్మతల నుంచి బయటపడొచ్చు..!!

Yoga: పురాతనమైన యోగాపై కొన్నేళ్ల క్రితమే అవగాహన పెరిగింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన యోగా మళ్లీ పుంజుకుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం యోగా.. అని ప్రజలు విశ్వసించడమే ఇందుకు కారణం. దీంతో యోగా చేసేవారు పెరిగారు. ఎందరో ప్రముఖులు యోగా వలన కలిగే ప్రయోజనాలు చెప్పారు. యోగా లాభాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. రేపే యోగా దినోత్సవం.

యోగాతో కలిగే ప్రయోజనాలను అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఒక్కమాటలో చెప్పారు. వారంలో ఒక్క గంటైనా యోగా చేస్తే మానసికగా బలంగా ఉంటామని తేల్చారు. మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిపై వారు చేసిన అధ్యయనంలో ఈ విషయాలను కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 30 మందిని రెండు గ్రూపులుగా విభజించారు.. మొదటి గ్రూపు వారిని వారానికి 3సార్లు, రెండో గ్రూపు వారిని వారానికి 2సార్లు చొప్పున మూడు నెలల పాటు యోగా చేయించారు. యోగా మొదటిపెట్టిన తొలిరోజు, చివరిరోజున వారి మెదళ్లను ఎంఆర్ఐ స్కాన్ చేశారు.

యోగా వల్ల మానసిక కుంగుబాటు పూర్తిగా తగ్గిందని నిపుణులు నిర్ధారించారు. వారానికి గంటపాటు యోగా చేయడం వల్లే ఇలా సాధ్యమైందని తేల్చారు. వారి మెదడులోని నాడీ వ్యవస్థలో సందేశాల బదిలీ జరిగి.. (గాబా) ‘గమ్మా అమినో బ్యూటైరిక్ యాసిడ్’ మోతాదు పెరగిందని గుర్తించారు. యోగా ముగిసిన నాలుగు రోజుల తర్వాత గాబా స్థాయి బాగానే ఉన్నా.. ఎనిమిది రోజుల తర్వాత నాడీ కణాల్లోని గాబా స్థాయి పెరగలేదని నిపుణులు గుర్తించారు. దీంతో మానసిక కుంగుబాటు నుంచి బయటపడాలంటే.. వారానికోసారి యోగా తప్పనిసరిని సూచించారు.

యోగా పూరాతమైనది. కాలక్రమేణా యోగాను మరుగున పడింది. ఇటీవల యోగాకు మళ్లీ ప్రాముఖ్యత పెరగింది. ప్రపంచం కూడా యోగా లాభాలను గుర్తించింది. యోగా కేవలం శరీర అందం కోసమే అని భావించేవారికి మనస్సును అదుపులో ఉంచేదని కూడా ఇటువంటి అధ్యయనాల ద్వారానే తెలుస్తోంది. మనలో కొన్ని వ్యాధులు మానసిక వ్యథ కారణంగానే వస్తున్నాయి. దీనిని అధిగమించాలేం యోగా మంచి ఆప్షన్. నిత్యం యోగా చేయడం వల్ల మనస్సు, శరీరం రెండూ అదుపులో ఉంటాయి. ఇది నిజమని ఎందరో నిరూపించారు కూడా.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.