Home Health & Fitness Health Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచితే ఆరోగ్యం మన ఒంట్లోనే..!!

Health Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచితే ఆరోగ్యం మన ఒంట్లోనే..!!

Health Plants: మన ఇళ్లలో ఎన్నో మొక్కలు పెంచుకుంటాం. గార్డెన్ ఉంటే మరిన్ని మొక్కలు పెంచుతాం. ఫ్లాట్ అయినా కూడా మొక్కలకు స్పేస్ ఇస్తాం. గ్రీనరీపై ఉండే ప్రేమ ఒకెత్తయితే.. మొక్కలంటే ఉండే ఇష్టం మరొకటి. బయట పెరిగిపోతున్న పొల్యూషన్ కు తగ్గట్టు ఇంట్లో కూడా మొక్కలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజుల్లో నెలకొంది. ఈక్రమంలో చిన్న సైజులోనే ఉండి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి. వాటిని ఇంట్లో పెంచుకుంటే ఎంతో మేలు. అటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. వాటి ఆకులు, పూలు, గింజలు, కూరల్లో, సూప్‌, టీలో ఉపయోగించడం ద్వారా ఆరోగ్యం పెంచుకోవచ్చు.

Ph | Telugu Rajyam

తులసి: దాదాపుగా తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. తులసి మొక్క భక్తి సెంటిమెంట్. ఔషధ గుణాలు కూడా ఎక్కువ. తులసిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి, కీళ్లనొప్పులు, కళ్లలో దురద, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, డయాబెటిస్‌ను తగ్గించడంతోపాటు ఒత్తిడిని దూరం చేస్తుంది.

అశ్వగంధ: ఆయుర్వేదంలో కీలకమైన మొక్క. ఔషధ గుణాలు ఎక్కువ. ఆరోగ్యం, బ్రెయిన్‌కి చురుకుదనం అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కండరాల శక్తిని పెంచడమే కాదు.. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇంటి పెరట్లో ఈ మొక్కను పెంచుకోవచ్చు.

అలోవెరా: ఇదో అద్భుత మొక్క. నిండా ఔషధ గుణాలే. చుట్టూ 80 అడుగుల దూరంలో గాలిని క్లీన్ చేస్తుంది. గాయాల్ని నయం చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఎక్కువ నీరు పొయ్యకుండానే ఈ మొక్క అలా బతుకుతూనే ఉంటుంది. ఒక్క మొక్కతో… పదుల మొక్కలు పుట్టుకొస్తాయి.

మెంతి: మెంతులు లేకుండా వంటగది ఉండదు. మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తల్లిపాలను పెంచుతాయి. డయాబెటిస్ తగ్గడంలో ముఖ్యపాత్ర పోషించడమే కాదు.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఈ మొక్క కూడా ఇంట్లో ఈజీగా పెరుగుతుంది.

శతవారీ: ఇది కూడా ఆయుర్వేద మొక్కే. ఒత్తిడి, టెన్షన్లను తగ్గిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరంలోకి విష వ్యర్థాల్ని రానివ్వకుండా అడ్డుకుంటుంది. డయేరియాను ఆపుతుంది. ఇంటి ఆవరణలో చాలా తేలిగ్గా పెరిగే మొక్క.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

 

Related Posts

‘మైగ్రేన్’ విముక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

మైగ్రేన్... తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పి. సాధారణంగా వచ్చే తల నొప్పికి ఒక కప్పు టీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తరుచుగా...

ఆరోగ్యానికి అమృతం… ‘డ్రాగ‌న్ ఫ్రూట్’ ! ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా ప్రజలలో ఈ మధ్య ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద అవగాహన పెరిగి ఫ్రూట్స్ వాడకం చాలా ఎక్కువైంది. ఈ క్రమంలోనే 'డ్రాగ‌న్ ఫ్రూట్' ప్రాధాన్యత వాణిజ్యపరంగా బాగా పెరిగింది....

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉదయాన్నే వీటిని ట్రై చేయండి !

ఒక మంచి వేకువ జాము దినచర్య అనేది ఎంతో మంది విజయ రహస్యంగా భావించవచ్చు. కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లక్ష్యాలను చేధించే ప్రక్రియకు శక్తినిస్తాయి. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే...

Related Posts

Latest News