Jowar Roti: జొన్నరొట్టెలతో ఎంతో ఆరోగ్యం..! బరువు తగ్గడానికి మంచి ఆప్షన్..!!

Jowar Roti: తినే ఆహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే పదార్ధాలు తీసుకోవడం చాలా అవసరం. జీర్ణక్రియ సక్రమంగా జరిగితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. అటువంటి ఫుడ్స్ లో జొన్న పిండితో చేసిన రొట్టెలు, ఇతర వంటకాలు ముందు వరుసలో ఉంటాయి. అనేక ప్రయోజనాలు వీటి సొంతం. వీటిలో ఎన్నో పోషకాలు కూడా ఉండటంతో మరింత ఆరోగ్యాన్నిస్తాయంటున్నారు ఆహార నిపుణులు. అధిక బరువును తగ్గించడంలో జొన్నరొట్టెలు చాలా దోహదపడతాయి. డైటింగ్, ఇష్టమైనవి తినకపోవడం వంటివి చేసే బదులు జొన్నరొట్టెలు తినమంటున్నారు.

జొన్నరొట్టెలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. జొన్నరొట్టెలు, జొన్నలతో చేసే ఇతర వంటకాలు సులభంగా జీర్ణం అవుతాయి. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మెటబాలిజం పెంచుతుంది. వీటిలోని విటమిన్లు, మినరల్స్ మైక్రో న్యూట్రియంట్స్ ఎముకలను బలంగా ఉంచుతాయి. కాన్‌స్టిపేషన్‌ సమస్యలను తొలగిస్తుంది. ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది. రోజువారీ పనుల్లో యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.

రెండు కప్పుల జొన్నల పిండి, సరిపడా నీళ్లు తీసుకుని దానిని చపాతి పిండిలా కలపాలి. అలానే.. ముద్దలుగా చేసుకుని ఒక కాటన్ క్లాత్ పై ఉంచాలి. చపాతిని చేసినట్టే పలచగా చేయాలి. మరీ పలుచగా కాకుండా చేయాలి. చపాతీలానే పెనంపై వేసి కాల్చుకోవాలి. వీటిని మీకు నచ్చిన కూర చేసుకుని లేదా చట్నీతో తినేయొచ్చు. ఇవి ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. బరువు పెరగకుండా శరీరాన్ని నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు ఆహార నిపుణులు.

మనం వీటని జొన్నలు అని పిలుస్తాం. కొన్ని చోట్ల జొవార్‌.. సొర్గుమ్‌.. క్వినోవా అని కూడా పిలుస్తారు. రోజంతా శారీరక కష్టం చేసేవారు జొన్నరొట్టెలను బాగా ఇష్టపడతారు. దీంతో వారు ఆరోగ్యంగా, ధృఢంగా ఉంటారు. చేసే పనిలో అలసిపోరు. అందుకు జొన్నలు బలం అంటారు. తినడానికి కాస్త గట్టిగా ఉన్నట్టున్నా అలవాటు చేసుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.