సమ్మర్ బాడీ హీట్ తగ్గాలంటే సబ్జా పడాల్సిందే..!

వేసవి వచ్చిందంటే బాడీ హీటెక్కిపోతూ ఉంటుంది. కాసేపు ఎండలో ఉన్నా చాలు సూరీడి వేడి సెగలా తగులుతుంది. ఇక బయటకు వెళ్తే ఉక్కపోత. నోరు దాహం.. దాహం అంటుంది. శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది. నీళ్లు ఎక్కువ తాగాలి. దీంతోపాటు బాడీ హీటెక్కకుండా ఉండేందుకు మంచి ఫుడ్ తీసుకోవాలి. వాటిలో సమ్మర్ ఫుడ్ గా పేరున్న ‘సబ్జా’ ఒకటి. ఒంట్లో ఎంతటి వేడి ఉన్నా తగ్గిస్తుంది.. బాడీని కూల్ చేస్తుంది. ఎసిడిటీ, బ్లోటింగ్, తలనొప్పి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది కూడా.


సబ్జాను తీసుకునే గంట ముందు నీళ్లు లేదా మజ్జిగలో నానబెట్టాలి. షర్బత్, మిల్క్ షేక్స్, ఫలూదాలో కూడా సబ్జాను తీసుకోవచ్చు. వీటిలోనే కాదు.. సబ్జాను నీళ్లలోనే కాసింత ఉప్పు, పంచదార కలిపి తీసుకున్నా మంచిదే. సబ్జా గింజల్లో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ కొవ్వు కరిగించడానికి, బరువు తగ్గించేందుకు సాయపడుతుంది. సబ్జాలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణశక్తికి మేలు చేస్తుంది. సబ్జా తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. ఫ్యాట్ తగ్గుతుంది. వికారంగా, వాంతి వస్తుందనిపించినా సబ్జా నీళ్లు తాగితే ఫలితం ఉంటుంది. పిల్లలకు సబ్జా మేలు చేస్తుంది. ప్రతిరోజు ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు.

సబ్జా తీసుకోవడం వల్ల టైప్2 డయాబెటిస్ ఉన్నవాళ్లో ఫలితం కనిపిస్తుంది. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు తొలగి పోతాయి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, జ్వరం కూడా తొలగి పోతాయి. సబ్జా వల్ల ఉన్న ఇన్ని ప్రయోజనాలతో సమ్మర్ హీట్ నుంచి మనల్ని మనమే కాపాడుకున్నట్టు అవుతుంది. సీజన్ తో సంబంధం లేని ఫుడ్ సబ్జా. ముఖ్యంగా సమ్మర్ లో మరీ మంచిది. చిన్న చిన్న రెసిపీస్ లో సబ్జాను తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బాడీలో సమ్మర్ హీట్ ను సులభంగా దాటించేయొచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా సబ్జాను తీసుకోవడమే ఉత్తమం.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ఆహార నిపుణులు ఆయా సందర్భాల్లో తెలిపిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. అహార నిపుణులు, వైద్యుల సలహాలకు పై వివరాలు ప్రత్యామ్నాయం కాదు. ఎటువంటి అరోగ్య సమస్యలకైనా సలహాల కోసం అహార నిపుణులు, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.