Acai Berry: పోషకాలెన్నో ఉన్న ‘నేరేడు పండు..’! ఆరోగ్య ప్రయోజనాలు మెండు

Acai Berry: సీజనల్ ఫ్రూట్స్ గా వచ్చే వాటిలో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి వర్షాకాలంలో మాత్రమే వస్తాయి. ఎంతో రుచికరమైనవి. ఎన్నో ఔషధ గుణాలు ఉండటంలో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే.. నేరేడు పండ్లను పండించడం కొంచెం కష్టం. నేరేడు చెట్లు చాలా తక్కువగా ఉండటంతో దిగుబడి కూడా తక్కువే. ఇప్పుడు కొత్తగా నేరేడు పండ్ల పొడిని కూడా అమ్ముతున్నారు. ఈ పండ్లలో ఐరన్, సి విటమిన్‌ పుష్కలంగా ఉంటాయి. అన్ని వయసుల వారికి ఇవి మేలు చేస్తాయి. నేరేడు పండ్లు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది… రక్తంలో ఆక్సిజన్‌ సరఫరా కూడా బాగుంటుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. రక్తనాళాలు బిగుసుకు పోకుండా చేసి.. రక్తం ప్రసరణ బాగుండేలా చేస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు పండ్లు చాలా మంచిది. తియ్యగా ఉన్నాయనే డౌట్ అక్కర్లేకుండా డయాబెటిస్ పేషెంట్లు తినొచ్చు. వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువే ఉండటం.. రక్తంలో షుగర్‌ లెవెల్‌ను నార్మల్‌గా ఉంచడం.. డయాబెటిస్ పేషెంట్లకు ముఖ్యంగా కావాల్సిన ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగేలా చేస్తాయి కాబట్టి వీటిని తినొచ్చు. నేరేడు పండ్లను తినడం వల్ల స్కిన్ మృదువుగా.. అందంగా అవుతుంది. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. నేరేడు పండ్లు పళ్లకు కూడా మంచిది. చిగుళ్లు గట్టిపడేలా చేస్తాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చిగుళ్ల నుంచి రక్తం కారకుండా చేస్తాయి.

నేరేడు పండ్లు తింటే కంటి చూపు కూడా పెరుగుతుంది. నేరేడులో ఉండే పొటాషియం గుండెకు రక్షణని ఇస్తుంది. 100 గ్రాముల నేరేడు పండ్లలో 55 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. నేరేడుపండ్లను జ్యూస్ గా కూడా చేసుకుని తాగొచ్చు. విత్తనాలు తీసేసిన నేరేడు పండ్ల గుజ్జును మిక్సర్ చేయాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా తేనె, చిన్న అల్లం ముక్క, కొద్దిగా మసాలా వేసి జ్యూస్ తయారు చేసి తాగొచ్చు. లైట్ కూలింగ్‌తో తాగినా బాగుంటుంది. జ్యూస్ లో కూడా నేరేడు వల్ల దక్కే ఆరోగ్య ప్రయోజనాలన్నీ దక్కుతాయి. వర్షాకాలం వస్తోంది కాబట్టి ఇప్పుడు నేరేడు పండ్లు కూడా వస్తాయి.

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.