కూరగాయలు పండ్లు ప్రతిరోజ తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుత కాలంలో ప్రజలు తీసుకొని ఆహారపాలు వాటిలో మార్పులు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కరోనా సమయం నుండి ప్రజలు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నారు. అందువల్ల మళ్లీ ప్రకృతిలో లభించే ఆర్గానిక్ కూరగాయలు ఆకుకూరలు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందించే కూరగాయలలో చేమ దుంపలు కూడా ఒకటి. ఈ చేమ దుంపలలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషక విలువలు ఇమిడి ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల వహినపడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చేమదుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చేమ దుంపలలో రక్తంలోనే షుగర్ లెవెల్స్ ని నియంత్రించే రెండు రకాల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచూ చేమ దుంపలను ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అన్ని దుంపల లాగే చేమదుంపలలో కూడా పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ధమనుల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి గుండె ఆరోగ్యాన్ని సంరక్షణలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ చేమదుంపలలో అరుదుగా లభించే విటమిన్ b6 కూడా పుష్కలంగా ఉంటుంది. చేమ దుంపలలో ఉండే విటమిన్ ఇ గుండే జబ్బులు, హైపర్ టెన్షన్ కి కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ఈ దుంపలు తరచూ తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. ఈ దుంపలు తినటం వల్ల వీటిలోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి, శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. ఈ దుంపలలో కేలరీస్ తక్కువగా ఉండటం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ దుంపలను తింటూ వారి బరువు సమస్యను తగ్గించవచ్చు. చేమ దుంపలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది శరీరంలో వ్యాధనిరోధక శక్తిని పెంపొందించి అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా కాపాడుతాయి.
