ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలు పడేస్తున్నారా… ఇది తెలిస్తే ప్రతి ఒక్కరు దాచుకుంటారు?

సాధారణంగా మనం ప్రతిరోజు వంట చేసే సమయంలో మనకు ఉల్లిపాయ వెల్లుల్లి ఎంతో కీలకంగా ఉంటాయి. ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఏ వంటలు చేయలేము అవి లేకుండా చేసిన వంట కూడా పెద్దగా రుచి ఉండదు. అందుకే వంటలు ఉల్లిపాయ వెల్లుల్లి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. ఇలా మనం వంట చేసే సమయంలో ఉల్లిపాయ వెల్లుల్లి తొక్కలు పడేస్తాము. ప్రతి ఒక్కరూ ఇదే పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఉల్లిపాయ వెల్లుల్లి తొక్కలలో ఉన్నటువంటి ఈ ప్రయోజనాలు కనుక తెలిస్తే ఎవరు కూడా వాటిని పడేయరు. మరి ఉల్లిపాయ వెల్లుల్లి తొక్కలలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా ఉల్లిపాయ వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ క్రమంలోనే వీటి తోక్కలలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి.అయితే కండరాల నొప్పుల సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయ వెల్లుల్లి తొక్కలను శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం వల్ల కండరాల నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇకపోతే చర్మ సమస్యలతో బాధపడే వారికి ఉల్లిపాయ వెల్లుల్లి తొక్కలు ఎంతో ఉపయోగపడతాయి.

తామర, ఇతర చర్మ వ్యాధులతో బాధపడేవారు ఉల్లిపాయ వెల్లుల్లి తొక్కలు వేసి బాగా మరిగించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల ఈ చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉల్లిపాయ వెల్లుల్లి తొక్కలలో యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల ఈ సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఇకపోతే చాలామంది పని ఒత్తిడి కారణంగా ఎంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అల్లం వెల్లుల్లితో తయారు చేసిన టీ తాగటం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.