మనలో చాలామంది చద్దన్నం తినడానికి అస్సలు ఇష్టపడరు. చద్దన్నం తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమని చాలామంది భావిస్తారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే మాత్రం చద్దన్నం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వేసవిలో చద్దన్నానికి మించిన ఔషధం లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రోజూ చద్దన్నం తింటే మాత్రం ఆరోగ్యానికి ఢోకా ఉండదని వైద్యులు పేర్కొన్నారు.
రాత్రి వండిన అన్నాన్ని పెరుగు లేదా మజ్జిగతో కలిపి తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు. చద్దన్నం తినడం వల్ల శరీరానికి వేడి చేయకుండా ఉంటుందని చెప్పవచ్చు. చద్దన్నం రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పొట్టలో అల్సర్లు రాకుండా చేయడంలో చద్దన్నం ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు.
చద్దన్నం తినడం ద్వారా నీరసం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. త్వరగా ఆకలి వేయకుండా చేయడంలో చద్దన్నం ఉపయోగపడుతుంది. హైబీపీ సమస్యతో బాధ పడేవాళ్లు చద్దన్నం తినడం ద్వారా ఆ ఆరోగ్య సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాత్రి మిగిలిన అన్నాన్ని మజ్జిగలో నానబెట్టి తినడం ద్వారా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.
చద్దన్నం తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. మలబద్ధక సమస్యలకు చెక్ పెట్టే విషయంలో చద్దన్నం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. చద్దన్నం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. దంతాలు, ఎముకలను దృఢంగా ఉంచడంలో చద్దన్నం ఉపయోగపడుతుంది.