Ginger: అల్లం వాడటం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. అల్లం లేకుండా కొన్ని కూరలు వండుకోలేం కూడా. అల్లం కలిపిన మజ్జిగ, అల్లం టీ.. ఇలా అల్లంతో మనకు ఉపయోగాలే ఎక్కువ. అయితే.. రోజూ అల్లం కొద్దికొద్దిగా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల మనకు తెలీకుండానే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో మనం ఎదుర్కొనే సమస్యలు మనకు తెలీకుండానే తగ్గిపోతాయి. భూమిలోని వేర్ల నుంచి వచ్చే అల్లం ఎంతో శ్రేష్టం.
పొట్టలో ఉండే అనవసరమైన యాసిడ్లను అల్లం పోగొడుతుంది. గొంతు మంట, గ్యాస్, ఆహార నాళంలో గడబిడ వంటివి రోజూ కొద్దిగా అల్లం తీసుకుంటే కనిపించవు. ఈ యాసిడ్లు ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు వస్తాయి. అల్లం తీసుకుంటే ఈ సమస్య పోతుంది. పొట్టలో మంట, పేగుల్లో మంటను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, కీళ్ల మంట వంటివి ఉండేవారు అల్లం డైలీ వాడితే నొప్పులు తగ్గుతాయి. దీంతో కీళ్లు బాగా పనిచేస్తాయి. ఇదంతా అల్లం వల్లనే జరుగుతుంది.
అల్లంను రోజూ ఏదొక రకంగా తీసుకునేవారికి క్యాన్సర్ సోకే అవకాశాలు తక్కువని మిచిగాన్ యూనివర్శిటీలోని కాంప్రహెన్సివ్ కాన్సర్ సెంటర్ తేల్చింది. కాన్సర్ కణాలతో అల్లం బాగా పోరాడగలదని చెప్పారు. కీమోథెరపీ మందుల కంటే కేన్సర్ కణాలను చంపడంలో అల్లం బెటర్ అని నిర్ధారించారు. జీర్ణక్రియలో మార్పులొచ్చి రకరకాల సమస్యలు వస్తాయి. ఈ సమయంలో రోజూ అల్లం వాడితే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
కొందరికి తలొనొప్పి ఎక్కువగా వస్తుంది. అటువంటివారు మందులు వాడకుండా ప్రతిరోజూ అల్లం తీసుకుంటే మీకు తెలీకుండానే తలనొప్పి సమస్య మాయం అవుతుంది. బరువు తగ్గాలంటే ఎటువంటి వర్కవుట్లు చేసినా, డైట్ తీసుకున్నా అల్లం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అల్లం శరీరంలో ఉండే అదనపు కొవ్వును తొలగించి మెటబాలిజంను కంట్రోల్ చేస్తుంది. సాధారణ బరువుకు చేరుకుంటాం.
స్త్రీలలో మొదటిసారి గర్భం వచ్చిన వారికి ఉదయాన్నే నిద్ర లేవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వారికి వికారం, వాంతులు వస్తున్నట్లనిపిస్తుంది. వీరు డాక్టరును సంప్రదించి అల్లం ఎంత వాడాలో వాడకూడదో.. అసలు వాడచ్చో లేదో తెలుసుకుని వాడితే సమస్యలు తొలగుతాయి.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.