నెయ్యి ఆరోగ్యానికి మంచిదని రోజు తింటున్నారా…. ఇది తెలుసుకోవాల్సిందే!

ప్రతిరోజు ఆహారంలో భాగంగా నెయ్యిని తీసుకోవడం ఎంతో మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. వంటల్లో కూడా నెయ్యిని వాడుతూ ఉంటాం. నెయ్యితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే నెయ్యి తీసుకోవడం వల్ల చాలా శరీర బరువు పెరుగుతారని అపోహలో చాలామంది నెయ్యి తినడం మానేస్తుంటారు. నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఆవు నెయ్యిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే నెయ్యిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దక సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ ఆహారంలో భాగంగా నెయ్యి తినడం వల్ల ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు. చదువుకునే పిల్లలకు, ఎదిగే పిల్లలకు నెయ్యిని తప్పకుండా ఆహారంలో భాగంగా ఇవ్వాలి. నెయ్యిని తినడం వల్ల పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది.దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిని తినడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

నెయ్యి మనకు మేలు చేసేదే అయినప్పటికి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశాలు ఉంటాయి. రోజుకు 3 నుండి 4 టేబుల్ స్పూన్ ల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక నెయ్యిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.