వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలా..? ఈ ఫుడ్ ట్రై చేయండి..!!

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మనం చూపించిన నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి దారి తీసింది. ఈ సమయంలో వైరస్ సోకకుండా జాగ్రత్తులు తీసుకోవాలి. మాస్క్ ధరించడం, అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకపోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యాయామం చేయాలి. వీటన్నింటితోపాటు శారీరకంగా బలంగా ఉండడం కోసం బలవర్ధకమైన ఆహారం కూడా తీసుకోవాలి. శరీరానికి వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం కూడా తీసుకోవాలి.

తీసుకునే ఆహారంలో నెయ్యి ఉండటం మంచిది. మరీ ముఖ్యంగా దేశీయంగా తయారైన నెయ్యి మంచిది. తేనె కూడా తీసుకుంటూ ఉండాలి. నెయ్యిలో కల్తీ ఎక్కువగా ఉంటుంది. మంచి శ్రేష్టమైన నెయ్యిని తీసుకోవాలి. దీనివల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. ఎప్పుడోఓసారి కాకుండా బాడీ డీ-హైడ్రేషన్ కు గురి కాకుండా తాగుతూ ఊండాలి. అసలే వేసవి కాలం కావడంతో మరింతగా మంచినీళ్లు తాగాలి.

ఆహారంలో ఉప్పూ, పంచదార ఎక్కువగా ఉండకూడదు. సమపాళ్లలో ఉండాలి. నూనెతో చేసిన పదార్ధాలు తగ్గించాలి. వేపుళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. శరీరానికి శక్తినిచ్చే బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు.. వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది. పప్పు, ధాన్యం, రాజ్మాతో కూడిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్ ఫ్రూట్స్, మార్కెట్లో దొరికే పండ్లు తీసుకోవడం మంచిది.

ఆహారంలో తాజా ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవాలి. పెరుగు తప్పనిసరి చేసుకోండి. ఉడకబెట్టిన గుడ్లు తినడం ఎంతో బలాన్నిస్తుంది. గుడ్లు బాగా ఉడకాలి.. సగం ఉడికిన గుడ్లు తినకూడదు. చికెన్ తినడం కూడా మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత బలాన్ని ఇస్తుంది. ఇవన్నీ మన శరీరంలో ముఖ్యమైన వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ప్రస్తుత సమయంలో మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి చాలా అవసరం. మంచి ఆహారం, బలవర్ధకమైన ఆహారం ఎంతో అవసరం.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో వైద్యులు, ఆహార నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. అర్హత ఉన్న నిపుణుల అభిప్రాయాలకు ఇవి ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వెంటనే వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి పై కథనం విషయంలో ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.