ఇండియాలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ బిఎఫ్ 7 కరోనా వేరియంట్ లక్షణాలు ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

యావత్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ మహమహమ్మారీ ఎన్నో ప్రాణాలని బలిగొంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి అయినప్పటికీ కరోనా వైరస్ తన లక్షణాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కొత్త వేరియాట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. తాజాగా చైనాలో కరోనా కొత్త వేరియట్ ఒమిక్రాన్ బిఎఫ్.7 తీవ్రస్థాయిలో వ్యాపించి ప్రజల మరణాలకు కారణం అవుతుంది.
చైనాలో రాబోయే 3 నెలల్లో 66 శాతం మందికి ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ సోకి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందంటూ చైనాకు చెందిన ఎరిక్ ఫీగ్-డింగ్ అనే ఎపిడెమియాలజిస్ట్ చేసిన ట్వీట్ చైనా పౌరులతో పాటు యావత్ ప్రపంచాన్ని కలవరపాడుకు గురిచేస్తోంది.

ఇంతకు మునుపు మనపై దాడి చేసిన కరోనా వైరస్
వేరియంట్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక కాలం పాటు వ్యాప్తిలో ఉంది. చైనాలో కలవరపాడుకు గురి చేస్తున్న ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎంత త్వరగా సంక్రమిస్తుందో అంతే త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ సంక్రమించే వేగం కూడా ఎక్కువే.ఈ వేరియంట్ ఒక్కరికి సోకితే.. వారి నుంచి 15 మంది నుంచి 18 మంది వరకు వైరస్ సోకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.బిఎఫ్.7 వేరియంట్ లక్షణాలు లేకుండా సోకితే అది మరింత ప్రమాదకరం కానుంది. ఇప్పటి కరోనా కొత్త వేరియట్ లక్షణాలు త్వరగా బయటపడవు కాబట్టి మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

నిపుణులు సూచించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రాబోయే కొన్ని నెలల్లో సుమారు 10 లక్షల మంది కరోనా కొత్త వేరియంట్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే భౌతిక దూరం పాటిస్తూనే సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవడం, ఇంట్లో ఉన్న మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, ఏ మాత్రం జాగ్రత్త నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవాలి.