ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారు ఈ జాగ్రత్తలు పాటిస్తే వారి ఆదాయం మరింత పెరుగుతుంది…?

Central govt new scheme for unemployed who lost jobs during lockdown

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వారి భవిష్యత్తు కోసం కొంత మొత్తంలో డబ్బు పొదుపు చేయాలని అనుకుంటారు. అందువల్ల బ్యాంకులలో కొంతమేర డబ్బు ఫిక్స్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం కట్టడి చర్యల్లో భాగంగా మే 2022 నుండి ఫిబ్రవరి 2023 మధ్య కాలంలో ఆర్బీఐ రెపోరేట్లను ఏకంగా 250 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపో రేటు పెరుగుదలకు అనుగుణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచాయి. అయితే మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బాండ్‌లు వంటి పెట్టుబడి పథకాల్లో ఆదాయం స్థిరంగా ఉండవు.అదే ఫిక్స్డ్ డిపాజిట్ లలో అయితే కచ్చితంగా బ్యాంకు హామీ చేసినటువంటి వడ్డీ మనకు లభిస్తుంది. అందువల్ల ఫిక్స్డ్ డిపాజిట్ లలో పొదుపు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరింత లాభం కావాలంటే బజాజ్ ఫైనాన్స్‌లో FDని ప్రారంభించవచ్చు. బజాజ్ ఫైనాన్స్‌ కి [ICRA]AAA(స్టేబుల్), CRISIL AAA/STABLEతో సహా అత్యధిక భద్రతా రేటింగ్‌లు లభించాయి. ఇంకా, రెపో రేటులో అద్భుతమైన పెరుగుదలకు అనుగుణంగా, బజాజ్ ఫైనాన్స్ సంవత్సరానికి 8.10% వరకు FD రేటును అందిస్తోంది. బజాజ్ ఫైనాన్స్‌తో, కస్టమర్లు 7.15% నుండి రూ.15,000 నుండి రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేయడం ద్వారా లాభదాయకమైన వార్షిక FD రేట్ల నుండి ప్రయోజనం పొందవచ్చు. అధిక రేటును పొందేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

• మెచ్యూరిటీ వ్యవధి ఎంత ఎక్కువ ఉంటే FD రేటు కూడా అంత పెరుగుతుంది. అందువల్ల, వ్యక్తులు తమ డబ్బును ఎక్కువ కాలం పాటు FDలో ఉంచగలిగితే, వారు తమ డిపాజిట్లపై ఎక్కువ సంపాదించవచ్చు. అందుకే ఎక్కువ వ్యవధి ఉన్న FDలను ఎంపిక చేసుకోండి.

• అలాగే కస్టమర్‌లు వడ్డీ చెల్లింపు ఎప్పుడు కావాలో ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒక వేళ మీకు మధ్యలోనే డబ్బు అవసరం పడితే విత్ డ్రా చేసుకోవడం ద్వారా వడ్డీ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇన్వెష్ట్ చేసిన డబ్బు మాత్రం వెనక్కి తిరిగి వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే సమయంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్య మైన విషయం ఏమిటంటే సీనియర్ సిటిజనుల పేరిట మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్లయితే మీకు వడ్డీ ఎక్కువగా లభించే అవకాశం ఉంది.