మనలో చాలామందిని కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. జీవనశైలిలో మార్పుల వల్ల శరీరంలోని ఖనిజాలు కిడ్నీలలో రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ట్యాబ్లెట్ల ద్వారా కిడ్నీలోని రాళ్లకు చెక్ పెట్టే అవకాశం ఉండగా మరి కొన్నిసార్లు మాత్రం కాల్షియం, పొటాషియం పేరుకుపోయి రాళ్లుగా మారతాయి. కిడ్నీలోని రాళ్ల సమస్య వల్ల ఇబ్బంది పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
కిడ్నీలో ఉండే రాళ్లు చిన్నగా ఉండటంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నొప్పిని కలిగిస్తాయి. కిడ్నీలోని రాళ్ల వల్ల కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటే ఈ సమస్య కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ మూత్ర విసర్జన చేస్తున్నా, మూత్రంలో రక్తం వస్తున్నా కిడ్నీలో రాళ్లు కారణమవుతాయి.
యూరిన్ టెస్ట్ చేయించడం ద్వారా ఈ సమస్యను సులువుగా గుర్తించవచ్చు. జ్వరం, చలి, వికారం, వాంతులు లాంటి సమస్యలు తరచూ వేధిస్తున్నా కూడా యూరిన్ సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది. బీన్స్ తీసుకోవడం, ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం, ఎండబెట్టిన తులసి ఆకులు తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు సులువుగా కరిగే అవకాశం ఉంటుంది.
కిడ్నీ సంబంధిత సమస్యలు కొన్నిసార్లు ప్రాణాలకు సైతం అపాయం కలిగిస్తాయి. తగినంత నీటిని త్రాగుతూ, దానిమ్మ రసాన్ని తీసుకుంటూ, నిమ్మకాయ నీళ్లు, సెలెరీ జ్యూస్, డాండెలైన్ రూట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. ఈ చిట్కాలను పాటించడంతో పాటు మందులు వాడటం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.