మనలో చాలామంది ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. మనలో చాలామంది త్రిఫల చూర్ణం గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. ఆయుర్వేదంలో ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ మిశ్రమానికి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. త్రిఫల చూర్ణం తీసుకుంటే కఫ, పిత్త, వాత దోషాలు సులువుగా దూరమవుతాయి.
త్రిఫల చూర్ణం శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజానాలను కలిగిస్తోంది. త్రిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మలబద్ధకాన్ని నివారించడంలో త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
తిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా పేగుల్లో ఏవైనా టాక్సిన్స్ పేరుకుపోతే వాటిని సైతం బయటకు పంపించే అవకాశం అయితే ఉంటుంది. జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. శరీరంలో పేరుకుపోయిన చెడుకొవ్వును సైతం కరిగించడంలో త్రిఫల చూర్ణం తోడ్పడుతుంది. ఇది తీసుకోవడం ద్వారా వాపు, కండరాల నొప్పులు దూరమవుతాయి.
గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలకు చెక్ పెట్టడంలో ఇది ఉపయోగపడుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.