ప్రతిరోజు ఈ కూరగాయలను ఆహారంగా తీసుకుంటే చాలు…. బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు?

ఆ సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో కూరగాయల పాత్ర చాలా ఎక్కువ. మనం నిత్యం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సహజ సిద్ధమైన విటమిన్స్ ,మినరల్స్, ప్రోటీన్స్,లిపిడ్స్ ,కార్బోహైడ్రేట్స్ వంటి ఖనిజ లవణాలు మన ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మనల్ని శారీరకంగాను మానసికంగానూ దృఢంగా ఉంచుతాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, గుండె జబ్బులు
ఉబకాయం, అతి బరువు, వంటి సమస్యలతో బాధపడేవారు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే కూరగాయలను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు

వాస్తవానికి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం మన శరీరానికి చాలా అవసరం అయితే మధుమేహం, ఉబకాయం, బరువు తగ్గాలనుకునే వారు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని కూరగాయలను నిత్యం తీసుకోవడం మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే కాయగూరల్లో ప్రధానమైనది టమోటా ఇందులో కేవలం 18 కేలరీల శక్తినిచ్చే 3.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకున్నవారు టమోటాలు నిక్షేపంగా తినొచ్చు.అలాగే విటమిన్ ఏ ,విటమిన్ సి పుష్కలంగా ఉండి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

కాలీఫ్లవర్ లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. కావున అతి బరువు సమస్యతో బాధపడేవారు కాలీఫ్లవర్ ను తమ రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ అలెగ్జిటిక్ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కణాలను తొలగిస్తాయి.

దోసకాయ జాతికి చెందిన జుక్కిని కూరగాయలో మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి జుక్కినిలో కేవలం 3.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి కావున ఉబకాయం, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు తమ డైట్లో చేర్చుకోవచ్చు.

పుట్టగొడుగులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి విటమిన్స్, మినరల్స్ ,కొవ్వు పదార్థాలు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావున మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పూజిస్తుంది. పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి శాఖాహారం.

పాలకూరలో 3.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యకు మంచి పరిష్కారం చూపుతుంది. క్యాల్షియం ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది.