చలికాలంలో వీటిని తింటే చాలు ఎన్నో సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు!

మనిషి ఆరోగ్యానికి కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యం. సీజన్లను బట్టి అందుబాటులో ఉన్న అని పండ్లను తింటే శరీరం చాలా చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే పచ్చి బఠానీలు ఎంతో కీలకమైన వని చెప్పాలి. ఇందులో ప్రొటీన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, పొటాషియం ఉంటాయి. అందుకే చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను తెలుసుకుందాం..

పచ్చి బఠానీలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉదరానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్.. పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది అలాగే మలబద్ధక సమస్యను కూడా లేకుండా చేస్తుంది.
పచ్చి బఠానీలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

వ్యాయామాలు చేసేవారు పచ్చిబఠానీలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పచ్చి బఠానీలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. వీటిలో సెలీనియం అనే మూలకం ఉంటుంది. అందువల్ల బఠానీలకు రెగ్యులర్‌గా తీసుకుంటే ఆర్థరైటిస్‌, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని పేర్కొంటున్నారు.పచ్చి బఠానీలను రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఎందుకంటే పచ్చి బఠానీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. అందుకే డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు వారి ఆహార పదార్థాలలో పచ్చి బఠాణీలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోమని నిపుణులు చెబుతున్నారు.