శీతాకాలంలో సమృద్ధిగా లభించే పచ్చి బఠానీలను తినడానికి చాలామంది ఇష్టపడతారు. బఠానీ గింజలను పచ్చిగానైనా తినవచ్చు లేదా అన్ని రకాల కూరల్లో, సలాడ్స్ లో వేసుకొని తింటే ఎంతో రుచిగా అనిపిస్తాయి. బటాని గింజలను డ్రై నట్స్ గా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పచ్చి బఠానీలను తరచూ మన ఆహారంలో తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ , కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి. దీంతోపాటు మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఖనిజ పోషకాలు ఇందులో పుష్కలంగా లభ్యమవుతాయి.
పచ్చి బఠానీలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నప్పటికీ ఈ గింజలను అతిగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని న్యూట్రిషన్ నిపుణులు మనల్ని హెచ్చరిస్తున్నారు. సహజంగా ఏ ఆహార పదార్ధాన్ని అయినా ఎక్కువగా తింటే మనకు నష్టమే కలుగుతుంది అలాగే బఠానీ గింజలను ఎక్కువగా తింటే వీటిలో ఎక్కువగా ఉండే ప్రోటీన్స్, ఫైబర్ ఫైబర్ వంటి పోషకాలు జీర్ణం అవడంలో ఆలస్యం జరిగి గ్యాస్టిక్ కడుపునొప్పి కడుపుమంట మలబద్ధకం అజీర్తి వంటి అనారోగ్య సమస్యలు మనల్ని ఎక్కువగా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా అత్యల్ప జీర్ణక్రియ రేటు ఉండే శీతాకాలంలో వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడమే మంచిది.
బఠానీ గింజల్లో అధికంగా ఉండే ఫైటిక్ ఆమ్లాలు మరియు లెక్టిన్‌లు వంటివి మనం తీసుకునే పోషకాలను మన శరీరం గ్రహించడంలో ఆటంకం కలిగించి మనలో నీరసం అలసట వంటి సమస్యలు తలెత్తవచ్చు. అతి బరువు, ఉబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు అత్యధిక ప్రోటీన్లు, కొవ్వు పదార్థం ఉన్న బఠానీ గింజలను ఎక్కువగా తింటే సమస్య మరి తీవ్రమవుతుంది. మన శరీరంలో ప్రోటీన్ పరిమాణం పెరిగితే యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తుతుంది దాని ఫలితంగా కీళ్ల నొప్పులు, ఎముక అరుగుదల వంటి సమస్యలు తలెత్తవచ్చు.