పురుషులు ఈ సమస్యతో బాధపడుతున్నారా…. ఇవే కారణాలు కావచ్చు?

సాధారణంగా చాలామంది లైంగిక జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఎదుర్కొనే సమస్యలలో అంగస్తంభన సమస్య ఒకటి. చాలామంది పురుషులు ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉంటారు.అయితే ఇలా బాధపడేవారు వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతో మంచిదని లేకపోతే ఈ సమస్య మరిన్ని అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరచూ అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇవే ప్రధాన కారణాలుగా ఉండవచ్చు.

సాధారణంగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు అంటే వారిలో కొలెస్ట్రాల్ సమస్య ఉందని అర్థం.ఎక్కువగా కొలెస్ట్రాల్ స్థాయి ఉన్నవారిలో పురుషాంగానికి సరిపడా రక్తం సరఫరా సరిగా కాకపోయినప్పుడే ఇలాంటి అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.అదేవిధంగా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పని ఒత్తిడి కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇలా అధిక ఒత్తిడితో బాధపడే వారిలో తరచు అంగస్తంభన జరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

ఇలాంటి సమస్యతో బాధపడేవారు తరచూ వ్యాయామాలు చేయడం అలాగే మానసికంగా ప్రశాంతతను కలిగి ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అధికంగా కొవ్వు కలిగినటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టి ఎక్కువగా పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అయితే ఈ సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు.