మనలో చాలామంది మొక్కజొన్నలను, మొక్క జొన్నలతో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. మొక్కజొన్న తినడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. మొక్కజొన్న తక్కువ ఖర్చుతోనే లభించే ఆహారం కాగా వర్షం పడుతున్న సమయంలో మొక్కజొన్న పొత్తులు తింటే ఎంతో ఆనందంగా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
మొక్కజొన్న తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, షుగర్, ఫ్యాట్, ఐరన్ లభిస్తాయి. మొక్కజొన్నలో బీ12 ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో మొక్కజొన్న ఉపయోగపడుతుంది. రక్తహీనతకు చెక్ పెట్టడంలో మొక్కజొన్న సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ వల్ల గర్భవతులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
తక్కువ బరువు సమస్యలతో బాధ పడేవాళ్లు మొక్కజొన్న తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. నీరసం సమస్యతో బాధ పడేవాళ్లు మొక్కజొన్న తినేవాళ్లు ఈ సమస్యను అధిగమించవచ్చు. మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు. మలబద్ధకాన్ని నివారించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ మొక్కజొన్న ద్వారా లభిస్తాయి.
వేడి వేడి మొక్కజొన్న తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్నలో ఉండే ఫెలురిక్ యాసిడ్ వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మొక్కజొన్నలో ఉండే పోషకాల వల్ల శరీరానికి ఎంతో లాభం కలుగుతుందని చెప్పవచ్చు.
