పూర్వపు రోజుల్లో శుభకార్యాలు,పూజా కార్యక్రమాల్లో భోజనాలను అరటి ఆకుల్లో వడ్డించేవారు.ఇప్పటికి కొన్నిచోట్ల ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది.అసలు అరిటాకుల్లో భోజనం ఎందుకు తినాలి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయంలో చాలామందికి చాలా ఆపోహాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరి చిన్నప్పటి రోజుల్లో అరటి ఆకుల్లో భోజనం చేయడం అంటే మహా సరదా! కానీ ఈ రోజుల్లో ఆధునిక పోకడలతో శుభకార్యాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు,పేపర్ ప్లేట్లలోనే భోజనాలను వడ్డిస్తున్నారు. దీనివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా పర్యావరణానికి, మన ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోంది.
అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల మనం తినే ఆహారం మరింత రుచిగా మారుతుండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చు.అరటి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు కలిగి ఉండడం వల్ల ఆహార పదార్థాల్లోని ప్రమాదకర సూక్ష్మ జీవులను నశింపజేస్తాయి తద్వారా మనం తినే ఆహారం పరిశుభ్రంగా మారుతుంది.అరటి ఆకులలో సహజంగా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఒక రకమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్గా వచ్చే అన్ని రకాల జబ్బులను నివారించడానికి కూడా సహాయపడుతాయి.కావున అరటి ఆకులో వడ్డించిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరం పాలీఫెనాల్స్ ను శోషించుకుని రోగనిరోధక శక్తిని పెంచుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
అరటి ఆకులపై ఉండే సహజ మైనపు పూత లాంటి పదార్థంలో మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు ఔషధ గుణాలు నిండి ఉంటాయి. వేడి ఆహార పదార్థాలను అరిటాకుల్లో వడ్డించుకుని తిన్నప్పుడు ఈ మైనపు కూత కరిగి ఆహార పదార్థంలో కలుస్తుంది కావున మన శరీరానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు లభించి మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అరిటాకులు తొందరగా భూమిలో కలిసిపోతాయి కాబట్టి పర్యావరణానికి కూడా హాని కలగదు. అయితే ఈ రోజుల్లో క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా స్ప్రే చేస్తున్నాడంవల్ల అరిటాకులపై రసాయనా విశేషాలు మిగిలి ఉండవచ్చు కావున అరటి ఆకులను శుభ్రంగా కడిగి భోజనం చేయాలి.