మనలో చాలామంది స్వీట్లను ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. స్వీట్లు తినడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నప్పటికీ కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. చలికాలంలో బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ లడ్డూలు హెల్త్ బెనిఫిట్స్ తో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
బెల్లం, వేరుశనగతో తయారు చేసిన చిక్కీలను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఖర్జూరం, వేరుశనగతో చేసిన లడ్డూలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. టర్నిప్ పుడ్డింగ్ ఈ హల్వా తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ స్వీట్లు తినడం వల్ల జబ్బుల బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
ఖర్జూరం, వేరుశనగలోని పోషకాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో తోడ్పడతాయి. ఎక్కువ చక్కెర ఉన్న వంటకాలు తినడం మాత్రం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అయితే ఇప్పటికే షుగర్ సమస్యతో బాధ పడే వాళ్లు మాత్రం స్వీట్లు తినకూడదు. తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి దీర్ఘ కాలంలో ప్రయోజనాలు చేకూరుస్తాయి.
ఎక్కువ మోతాదులో స్వీట్స్ తినడం వల్ల శక్తి కోల్పోయే ఆవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అలసట, నీరసం, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చక్కెరతో చేసిన పదార్థాలు తిన్న తర్వాత లంచ్ చేస్తే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. రోగనిరోధక శక్తిపై ప్రభావం పడి, బ్యాక్టీయా, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంచదార, పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల డిప్రెసివ్ గా అనిపిస్తుంది. షుగర్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఒత్తిడి నుంచి బయటపడినా తర్వాత ఆరోగ్యంపై పెను ప్రబావం చూపుతుందన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.