పుచ్చకాయ గింజలను తినకుండా పడేస్తున్నారా? ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ కోల్పోయినట్లే!

సాధారణంగా అత్యధిక విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్,ఖనిజ లవణాలు,అమైనో ఆమ్లాలు ఉన్న పుచ్చకాయలను తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే చాలామంది పుచ్చకాయలోని గింజలను తినకుండా పక్కన పడేస్తుంటారు. వైద్య నిపుణుల సూచనల ప్రకారం పుచ్చకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ పుచ్చకాయ గింజల్లో లభిస్తాయని సూచిస్తున్నారు. మనం ఇప్పుడు పుచ్చకాయ గింజల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పుచ్చకాయ గింజల్లో అత్యధికంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్ వంటి సహజ పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి.ముఖ్యంగా పుచ్చకాయ గింజల్లో ఉండే ఔషధ గుణాలు మనం తీసుకునే ఆహారం నుంచి క్యాలరీలను గ్రహించి తక్షణ శక్తిగా మార్చడంలో తోడ్పడతాయి. పుచ్చగింజల్లో అత్యధికంగా ఉండే పొటాషియం, అమైనో యాసిడ్స్ రక్తనాళాలని వెడల్పుగా మార్చి రక్త ప్రసరణకు అడ్డంకులు తొలగించి రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చూస్తాయి. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయి.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి పుచ్చ గింజలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. దీనికిగాను పుచ్చగింజలను మంచినీళ్లలో బాగా మరిగించి ఆ నీటిని సేవిస్తే స్వల్ప కాలంలోనే కిడ్నీ రాళ్ల సమస్య తొలగిపోతుంది. అలాగే పుచ్చగింజల్లో ఉండే మెగ్నీషియం, మాంగనీస్, పోలిక్ యాసిడ్ నాడీ కణ వ్యవస్థను అభివృద్ధి పరిచి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. మరియు మెదడు కండరాలను శాంతపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పుచ్చకాయ గింజల్లో ఉండే లైకోపిన్ పురుషుల్లో శక్తిసామర్థ్యాలను పెంపొందించి లైంగిక సామర్ధ్య సమస్యలను తొలగిస్తుంది. అలాగే పుచ్చ గింజల్లో ఉండే పీచు పదార్థం, విటమిన్ సి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి ఉబకాయం, రక్తపోటు సమస్యలను దూరం చేస్తుంది.