ప్రతిరోజు ఈ కషాయం సేవిస్తే చాలు…. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

వేప చెట్టును పురాతన భారతీయ ఆయుర్వేద వైద్యంలో ఎన్నో మొండి వ్యాధులను అదుపు చేయడంలో అనాదిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. వేప చెట్టులోని ప్రతి ఒక్క భాగంలోను ఎన్నో రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వ్యవసాయంలో చీడపీడలను అదుపు చేయడంలో వేప ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంతటి ఔషధ గుణాలు ఉన్న వేప ఆకులను ప్రతిరోజు మనం ఉపయోగించినట్లయితే అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రతిరోజు దేవతగా ఆరాధించే వేప చెట్టు ఆకుల కషాయాన్ని తగిన పరిమాణంలో సేవించడం వల్ల ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి రక్షించడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ప్రమాదకర డయాబెటిస్ ,గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు,చర్మ క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు వేపాకు రసం ప్రతి రోజు సేవించడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

కిడ్నీ సమస్యతో బాధపడేవారు వేప ఆకులను ఆరబెట్టి వాటిని బూడిదగా మార్చి ప్రతిరోజూ గోరు వెచ్చని నీటితో కలిపి రెండు మూడు గ్రాములు సేవిస్తే కిడ్నీలో రాళ్లు కరగడంతో పాటు అనేక కిడ్నీ సమస్యలు తొలుగుతాయి
చర్మ సమస్యలైన గజ్జి, తామర, చర్మం పొడిబారడం,
దురదలు, చర్మ క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ వేప ఆకులు, పసుపు కలిపి మెత్తగా నూరి చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతిరోజు వేప కొమ్మతో పళ్లను శుభ్రం చేసుకుంటే దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటిపూత, దుర్వాసన నోటి క్యాన్సర్లు రాకుండా అదుపులో ఉంచవచ్చు.
జుట్టు రాలడం, పేను కొరుకు వ్యాధి, చుండ్రు మొదలగు సమస్యలతో బాధపడేవారు వేపాకులను మెత్తని పేస్టులా నూరి తలకు మర్దన చేసుకుని తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.