ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవాలా… ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే సరి?

అందంగా కనిపించాలని ఎవరైతే కోరుకోరు చెప్పండి.ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని చూస్తుంటారు. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం కారణంగా అనేక చర్మ సమస్యలు తలెత్తుతున్నయి. ఈ సమస్యలను అధిగమించడానికి ఏవేవో మందులు వాడుతూ ఇంకొన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా అందం రెట్టింపు చేసుకొని సూపర్ చిట్కాలను ఇక్కడ చూద్దాం…

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే తులసి మొక్క మన ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.తులసి ఆకులను, శెనగపిండి, పసుపు తగిన మోతాదులో వేసి మెత్తని పేస్టులా మార్చుకోవాలి. ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ పేస్టు ముఖానికి రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు నశించి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే తులసి ఆకులతో నిమ్మరసం కలిపి మెత్తని పేస్టులా మార్చుకుని వారానికి రెండుసార్లు ముఖానికి పట్టించుకున్నట్లయితే ముఖంపై మచ్చలు, మొటిమలు ముడతలు తగ్గుతాయి.

బంగాళాదుంపల్ని మెత్తగా చేసి రసం తీసిపెట్టుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే పొడిబారిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపను ముక్కల్లా తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత తీసి కళ్ల కింద రుద్దుకోవాలి. కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.