ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిస్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.డయాబెటిస్ వ్యాధికి ప్రధాన కారణం మన జీవన ప్రయాణంలో క్రమబద్ధతిలేని ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వంశ పారంపర్యంగా కూడా కొందరిలో డయాబెటిస్ వ్యాధి సంక్రమిస్తుంది.
ప్రారంభంలో డయాబెటిస్ వ్యాధి లక్షణాలను గుర్తించడం చాలా కష్టం కానీ పాదాలలో వచ్చే మార్పులను బట్టి గుర్తించవచ్చు.చాలా సందర్భాలలో పాదాలలో నొప్పి, అరికాలాల్లో మంటగా అనిపించడం,
జలదరింపు, తిమ్మిరి వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను గుర్తించకపోతే టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నిలువలు మోతాదుకు మించి పెరగడం వల్లే డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతుంది.టైప్ 2 డయాబెటిస్‌కు ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీనిని వైద్య భాషలో బోర్డర్‌లైన్ డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్ వ్యాధి అని కూడా పిలుస్తారు.
ఫ్రీ డయాబెటిస్ లేదా బోర్డర్ లైన్ డయాబెటిస్ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే కంటికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా కళ్ళు తిరగడం, కంటి చూపు మందగించి మసకబారడం, తీవ్రమైన తలనొప్పి కొందరిలో కంటి చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. బోర్డర్ లైన్ డయాబెటిస్ వల్ల శరీరం తొందరగా అలసిపోయి చికాకు, వణుకు వంటి సమస్యలు తలెత్తాయి. కొందరిలో అకస్మాత్తుగా రక్తపోటు పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణం కనిపిస్తుంది దీనివల్ల కళ్ళు తిరిగి పడిపోవడం, కోపం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ వ్యాధి బారిన ఒకసారి పడితే జీవితాంతం వ్యాధిని నియంత్రించుకోవడమే తప్ప బయటపడే మార్గాలు చాలా తక్కువ.