మధుమేహం వ్యాధి నియంత్రణ కోల్పోయినట్లు అనిపిస్తోందా…వ్యాధి తీవ్రతను తగ్గించే అద్భుత ఔషధం!

సకల వ్యాధి నివారిణిగా మునగ చెట్టు ప్రసిద్ధి చెందింది. పురాతన ఆయుర్వేద వైద్యంలో మునగ ఆకులు,బెరడు, వేర్లు, విత్తనాలను ఉపయోగించి ఎన్నో మొండి వ్యాధులను సునాయాసంగా నయం చేయవచ్చునని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు
మునగ ఆకులను మన రోజువారి ఆహారంలో ఫ్రై , పచ్చడి లేదా కూరగా వండుకొని తినవచ్చు. మరియు మునగాకు పొడిని తయారు చేసుకుని ఉదయం సాయంత్రం టీ, సూప్ తయారు చేసుకొని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ రోజుల్లో ఎక్కువమంది ఎదుర్కొనే మధుమేహ వ్యాధి నియంత్రణలో మునగ ఆకు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. కారణం మునగ ఆకుల్లో సమృద్ధిగా విటమిన్ సి,క్లోరోజెనిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది తద్వారా మధుమేహం వ్యాధినీ నియంత్రణలో ఉంచుతుంది. అలాగే మునగాకుల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి వంటి పోషకాలు వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్, ఆస్తియోపోరోసిస్ వంటి వ్యాధి తీవ్రతలను తగ్గిస్తుంది. తరచూ మునగ ఆకులు ఆహారంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ లోపాలు తొలగిపోయి మలబద్ధకం, విరోచనాల సమస్యను దూరం చేస్తుంది.

మునగ ఆకులో పుష్కలంగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మధుమేహం వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు మునగ కషాయాన్ని సేవిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించి మధుమేహం వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే మునగాకుల్లో సమృద్ధిగా ఉండే ఐరన్, విటమిన్ బి12 రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. తద్వారా అలసట, నీరసం వంటి లక్షణాలు తొలగిపోతాయి.