మీ పిల్లలు తరచూ జలుబుతో బాధపడుతున్నారా… నెయ్యితో ఇలా చేస్తే చాలు!

colds

శీతాకాలంలో వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవడం వల్ల చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలలో తరచూ దగ్గు జలుబు వంటి సమస్యలు పిల్లలని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఇలా తరచూ పిల్లలు జలుబుతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఎదురవడంతో ఎన్నో రకాల మందులను ఉపయోగించిన పెద్దగా ఫలితాలు ఉండవు. ఇలా ఎవరైతే పిల్లలు తరచూ జలుబు సమస్యతో బాధపడుతున్నారో అలాంటివారు నెయ్యితో ఈ చిన్న పని చేయటం వల్ల పిల్లలు ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు.

పిల్లలు ఎవరైతే తరచూ జలుబు సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారికి కాస్త నెయ్యి లవంగాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒక చిన్న బౌల్ లో ఒక పది టేబుల్ టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో ఒక నాలుగు లవంగాలు వేయాలి. ఇలా చిన్న మంటపై ఈ గిన్నెను ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన ఈ నెయ్యిని చిన్నపిల్లలకు ఉదయం ఒక టేబుల్ స్పూన్ సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ పట్టించాలి.

ఇలా ఈ నెయ్యిని రెండు మూడు రోజులు వరుసగా తాపించడం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతారు. అదేవిధంగా శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి కూడా బయటపడతారు. ఇక నెయ్యిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కనుక పిల్లలకు కూడా ఇది ఎంతో ఆరోగ్యకరం. అయితే నెయ్యి వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయని ఒక టేబుల్ స్పూన్ కి మించి స్థాపించడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి కనుక ఉదయం ఒక టేబుల్ స్పూన్ సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తాపించడం ఎంతో మంచిది.