రుచిగా ఉన్నాయని వంటకాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారా… ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోండి..!

మన వంటింట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలు మనకు అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా కొన్నిసార్లు తీవ్ర అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంటాయి.ముఖ్యంగా కారం,ఉప్పు, చక్కర, వంటనూనె,మసాలా దినుసులను ప్రతిరోజు ఆహారంలో ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం మీ ఒంట్లో అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా త్రిష్ట వేసినట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల స్వీట్లు,శీతల పానీయాలు, కాఫీ, టీ ఇలా ప్రతిదాంట్లో మోతాదుకు మించి చక్కెరను వినియోగిస్తే చివరకు చక్కర విషం గా మారే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మోతాదుకు మించి చక్కెరను అతిగా ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్,ఉబకాయం, కండరాల బలహీనత, మెదడు పనితీరు లోపించడం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

రోజువారి ఆహారంలో మైదా పిండిని ఎక్కువగా వినియోగిస్తే మైదాపిండి జీర్ణం కావడానికి అధిక సమయం తీసుకుంటుంది కావున మలబద్ధకం గ్యాస్టిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, ఉదర సంబంధిత క్యాన్సర్లు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

చాలామంది వంటకాల్లో రుచి కోసం ఉప్పును అధికంగా వినియోగిస్తుంటారు.మరి ముఖ్యంగా
ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో రుచికోసం టేస్టీ సాల్ట్, మసాలా దినుసులను ఎక్కువగా వినియోగిస్తే అప్పటికి రుచికరంగా అనిపించినప్పటికీ దీర్ఘకాలంలో
రక్తంలో సోడియం పరిమాణం పెరిగితే బ్లడ్ ప్రెజర్ పెరిగి అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో సోడియం శాతం ఎక్కువైతే కిడ్నీ పనితీరుపై ప్రభావం పడి కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది.

ఈ రోజుల్లో చాలామంది ఫ్రైడ్ రైస్ లకు అలవాటు పడ్డారు. ఫలితంగా వంటనూనెలను మోతాదుకు మించి ఆహారంలో తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా
రక్త పోటు, గుండె జబ్బులు, ఉబకాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాడిన నూనెలను మళ్లీమళ్లీ వంటకాల్లో ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వు పదార్థాలు, విటమిన్స్, ప్రోటీన్స్ నశించి పోవడమే కాకుండా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.