సమయం దొరికినప్పుడల్లా నిద్రపోతున్నారా… ఇది తెలిస్తే అసలు నిద్రపోరు!

చాలామంది నిద్రకు ఎంతో మంచి ప్రాధాన్యత ఇస్తారు ఈ క్రమంలోనే వారికి ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే నిద్రపోవడానికి ఇష్టపడతారు అయితే నిద్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
మనం నిద్రపోయే విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఏ సమయంలో నిద్ర పోవాల? వంటి అనేక సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.సరైన నిద్ర మానసిక ప్రశాంతతని, ఒత్తిడిని తగ్గించి మీలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో దోహదపడుతుంది.

నిద్ర ఆరోగ్యానికి మంచిది కదా అని సమయం దొరికినప్పుడల్లా నిద్రపోవడం వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి అందుకే ప్రతిరోజు కేవలం ఎనిమిది గంటలు అది రాత్రి సమయం మాత్రమే నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితేఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పగలు రెండు గంటలు వరకు నిద్రపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఎనిమిది గంటలకంటే ఎక్కువ సమయం నిద్రించేవారు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మన శరీరంలోని క్యాలరీలు ఖర్చు కావు దాంతో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు చుట్టుముడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.అతిగా నిద్ర పోవడం వల్ల గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ సమయం నిద్రించే అలవాటు ఉంటే వెంటనే అలవాటు మార్చుకోవడం మంచిది