క్యారెట్ లో ఉన్న పోషక విలువల గురించి మనందరికీ తెలిసిందే. సహజ పద్ధతుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలున్న క్యారెట్లు ప్రతిరోజు మన ఆహారంలో తీసుకోవడం సర్వసాధారణం.రోజురోజుకు మారుతున్న ఆహారపు అలవాట్లు,పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా మనలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. దీన్ని సరి చేసుకోవడానికి అదనపు ఆహారం తప్పనిసరి. అందుకుగాను ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ ను మన అదనపు ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
క్యారెట్ జ్యూస్ ను ఏ విధంగా తయారు చేసుకోవాలి. వాటి వల్ల కలిగే అద్భుత ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా తాజా క్యారెట్లను తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తర్వాత సుగంధ ద్రవ్యంగా వాడే దాల్చిన చెక్కను దోరగా వేయించి పొడిగా మార్చుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని క్యారెట్ ముక్కల్లో వేసుకొని తర్వాత చిన్న అల్లం ముక్క ,తగినంత తేనెను కలిపి మిక్సీలో ఆడిస్తే అధిక పోషక విలువలు ఉన్న రుచికరమైన క్యారెట్స్ జ్యూస్ తయారైనట్టే.
రుచికరమైన ఆరోగ్యకరమైన ఈ క్యారెట్ జ్యూస్ ను ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ ,సి ,ఫైబర్, బీటా కెరోటిన్, ఫైటో కెమికల్స్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు రోజంతా మనల్ని చురుగ్గా ఉంచుతుంది. దాల్చిన చెక్కలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు సీజనల్గా వచ్చే దగ్గు జలుబు, జ్వరం వంటి జబ్బులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. దాల్చిన చెక్కలో ఉన్న యాంటీ క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ కణాలను నాశనం చేసి మనల్ని అనేక క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది.
ప్రతిరోజు ఈ రుచికరమైన క్యారెట్ జ్యూస్ సేవిస్తే క్యారెట్ లో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ కంటి రెటీనాను రక్షించి కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క, అల్లం లో ఉన్న ఔషధ గుణాలు రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను, కొలెస్ట్రాల్ ను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అరికడుతుంది. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. క్యారెట్లు పుష్కలంగా ఉండే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మూలకాలు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి ప్రమాదకర అనీమియా వ్యాధిని దూరం చేస్తుంది. ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.