మన ఆరోగ్యానికి పండ్లు ఎంతో ముఖ్యమైనవి అనే విషయం మనకు తెలిసిందే.ఇలా తరచూ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినటువంటి పోషక విలువలు అందడమే కాకుండా మన శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అదేవిధంగా మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.ఇలా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి అయితే చాలామంది ఎక్కువగా పండ్లు తినడానికి ఇష్టపడుతూ వివిధ రకాల పండ్లను ఒకేసారి కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని తింటూ ఉంటారు.
ఇలా తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ కొన్ని రకాల పండ్లను కలిపి తినడం వల్ల మరికొన్ని సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ ఏ రకాల పండ్లను కలిపి తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే… ఆరెంజ్, క్యారట్ కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవటం వల్ల ఛాతిలో మంట ఏర్పడుతుంది. అదేవిధంగా కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జాంకాయం, అరటి కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండు పండ్లను ఒకేసారి తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యతో పాటు తలనొప్పి సమస్య కూడా వెంటాడుతుంది. పైనాపిల్‌లో బ్రోమెలెన్ పోషక పదార్ధముంటుంది. ఇది ఓ రకమైన ఎంజైమ్. పైనాపిల్ రసం నుంచి వస్తుంది. దీనిని పాలతో కలపడం వల్ల గ్యాస్, వాంటింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక చాలామంది బొప్పాయి పండు తినేటప్పుడు దానిపై కాస్త నిమ్మరసం కలుపుకొని తింటూ ఉంటారు ఇలా తినడం కూడా చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు ఇలా తినడం వల్ల ఎనీమియా, హిమోగ్లోబిన్ సమస్య ఉత్పన్నం అవుతుంది. అదేవిధంగా పండ్లతో పాటు కూరగాయలను తినడం కూడా మంచిది కాదు.