నీళ్లను తాగే విషయంలో ఈ నియమాలు కచ్చితంగా పాటించాల్సిందే లేకపోతే ఏమవుతుందో తెలుసా?

benefits-of-drinking-water

మన నిత్య జీవక్రియలు సక్రమంగా జరగాలంటే బలవర్ధకమైన ఆహారంతో పాటు మంచినీళ్లు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.మన శరీరంలో నీటి శాతం లోపిస్తే డిహైడ్రేషన్ సమస్య తలెత్తి అవయవాల పనితీరు మందగిస్తుంది తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నీటిని తాగే విషయంలో కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు లేదంటే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు.

ముఖ్యంగా భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచి అలవాటు కాదని చెబుతుంటారు. మరి ముఖ్య విషయం ఏమిటంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే నీళ్లను తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.పాలు తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు. ఇది మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పాల తాగిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అలాగే వేరుశెనగ గింజల్లో అత్యధిక ప్రోటీన్స్ తో పాటు నూనె, కొవ్వు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. దీని కారణంగా వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగడం హానికరం. వేరుశెనగ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి.

రోజుకు ఒక ఆపిల్ తింటే సంపూర్ణ ఆరోగ్యం లభించినట్లేనని చెబుతుంటారు అయితే ఆపిల్ తిన్న వెంటనే మంచి నీళ్లు తాగితే పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలో అత్యధిక నీటి నిల్వలు లభ్యమవుతాయి. కావున పుచ్చకాయ తిన్న వెంటనే నీటిని తాగితే మన ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే జీర్ణ రసం పలచబడుతుంది. దీని వల్ల కడుపు గ్యాస్టిక్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. స్ట్రాబెరీ పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కారణం స్ట్రాబెర్రీలో ఉండే సహజ చక్కెర, నీటి వల్ల జీర్ణ వ్యవస్థలో లోపాలు తలెత్తి ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.