ఈ మధ్య కాలంలో పురుషులు, మహిళలు అనే తేడాల్లేకుండా చాలామంది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. హిమోగ్లోబిన్ పెంచుకోవాలంటే, ఐరన్, విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే, డాక్టర్ సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఉపయోగించాలి. ఎర్ర మాంసం, పౌల్ట్రీ, చేపలు, బఠానీలు, కాయధాన్యాలు, టోఫు, బచ్చలికూర, బలవర్థకమైన తృణధాన్యాలు, బాదం, గింజలు, అవిసె గింజలు హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడతాయి.
నారింజ, మిరియాలు తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తాయి. యాపిల్స్, బెర్రీలు, దానిమ్మ తీసుకోవడం ద్వారా కూడా హెల్త్ కు మంచి జరుగుతుంది. బచ్చలికూర, బ్రోకలీ, గ్రీన్ బీన్స్ హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడతాయి. బీట్‌రూట్, దానిమ్మ రసం శరీరంలో హిమోగ్లోబిన్ ను పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.
ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం ద్వారా, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఐరన్ శోషణను పెంచడానికి, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. చిక్కుళ్లు, కాయధాన్యాలు హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడంలో ఉపయోగపడతాయి. టోపు, టెంపే శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తాయి.
బచ్చలికూర, ఇతర ఆకుకూరలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తీసుకోవడం ద్వారా శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. హిమోగ్లోబిన్ ను పెంచే ఆహారాలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.