సగ్గుబియ్యం ను తరచూ మన రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించు కోవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు. సగ్గుబియ్యం ను సబుదాన అని కూడా పిలుస్తారు.
సాబుదానా అనేది ఒక పిండి పదార్ధం. ఇందులో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ మినరల్స్ తో పాటు యాంటీఆక్సిడెంట్లు, రెసిస్టెంట్ స్టార్చ్ ,డ్యూటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తున్నాయి. సగ్గుబియ్యంతో ఎన్నో రుచికరమైన రెసిపీస్ తయారు చేసుకుని తినవచ్చు. సగ్గుబియ్యం లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీర బరువు తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నవారు తరచూ సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉన్న కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని అందించి రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంతోపాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించి సహజ పద్ధతులు శరీర బరువును పెంచుకోవచ్చు. సగ్గుబియ్యం లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కావున షుగర్ వ్యాధిగ్రస్తులు నిక్షేపంగా దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉన్న పొటాషియం రక్తప్రసన్న వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
తరచూ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే డెంటరి ఫైబర్ తిన్న ఆహారాన్ని మెరుగ్గా జీర్ణం చేయడంలో సహాయపడి మలబద్ధకం, అజీర్తి, గ్యాస్టిక్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. సగ్గుబియ్యం లో అత్యధికంగా ఐరన్ లభ్యమవుతుంది కావున రక్తహీనత సమస్యను దూరం చేసి అలసట నీరసం వంటి లక్షణాలను తొలగిస్తుంది. అత్యధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు సగ్గుబియ్యంతో చేసిన రెసిపీని ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించు ఉబకాయం, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సగ్గుబియ్యం లో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజలవనాలు మెండుగా ఉన్నందున ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. అలాగే నాడీ కణ వ్యవస్థను బలోపేతం చేసి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది.