ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటున్నారా? ఈ వ్యాధులతో బాధపడేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి!

ద్రాక్ష పండ్లను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజా అధ్యయనాల ప్రకారం ఒకేరోజులో ఎక్కువ మోతాదులో ద్రాక్ష పండ్లను తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని న్యూట్రిషన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వైద్యుల సూచనల ప్రకారం సంపూర్ణ ఆరోగ్యవంతులు 32 ద్రాక్ష పండ్లను ఒక రోజులు తినొచ్చు. జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు, అతి బరువు, అలర్జీ ఉన్నవారు మాత్రం ఒకరోజులో 10 ద్రాక్ష పండ్లకు మించి తినకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మోతాదుకు మించి ద్రాక్ష పండ్లను ఆహారంగా తీసుకుంటే కలిగే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటే వీటిలో అత్యధికంగా ఉన్న సాలిసిలిక్ యాసిడ్ జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేసి కడుపు ఉబ్బరం, గ్యాస్టిక్, కడుపులో మంట, విరోచనాలు, ప్రమాదకర డయేరియా వ్యాధిని కూడా ఒక్కొక్కసారి కలిగించవచ్చు. ఒకే రోజు ఎక్కువ ద్రాక్ష పండ్లను తినడం వల్ల మన శరీరానికి అదనపు కేలరీలు లభించి శరీర బరువు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ద్రాక్షకు అలెర్జీ చాలా అరుదు. గ్రేప్ లిపిడ్ ట్రాన్స్‌ఫర్ ప్రొటీన్, ద్రాక్షలోని నిర్దిష్ట ప్రోటీన్ కొందరిలో అలర్జీ సమస్యలకు కారణం అవుతుందని పేర్కొంటున్నారు.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్లను ఒకేరోజు ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ల సమస్య అధికం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కావున ఇలాంటి సమస్య ఉన్నవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ రోజుల్లో ఎక్కువమందిని కలవరపరుస్తున్న చక్కర వ్యాధి ఈ వ్యాధితో బాధపడేవారు ద్రాక్ష పండ్లను అధికంగా తింటే వీటిలో ఉండే క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ రక్తంలో గ్లూకోజ్ నిల్వలను అమాంతం పెంచి వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది కావున ద్రాక్ష పండ్లను తినే విషయంలో వైద్య సలహాలు తప్పనిసరిగా పాటించాలి.