నెయ్యి ఎక్కువగా తినే వారు ఈ విషయాలని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

నెయ్యిని తినే విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కొందరైతే నెయ్యి అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ తినడానికి సంకోచిస్తుంటారు. కారణం నెయ్యి తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని దాంతో ఉబకాయ, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయని ఇది కేవలం అపోహ మాత్రమే. న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం స్వచ్ఛమైన నెయ్యిలో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్,ప్రోటీన్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి.అలాగే క్యాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. కావున నిరభ్యంతరంగా నెయ్యిని రోజువారి ఆహారంలో తినొచ్చు. అయితే పరిమితంగా తీసుకోవాలి ఇష్టం కదా అని ఎక్కువ తింటే అనారోగ్య సమస్యలు తప్పవు మరి.

స్వచ్ఛమైన నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మన శరీరం మరియు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను సులువుగా కరిగించి గుండె పనితీరులు మెరుగుపరుస్తుంది. అలాగే రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా మన మీద దాడి చేసే అలర్జీలు, ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీకు ఇష్టమైన నెయ్యిని వేడి వేడి ఆహారంలో పరిమితంగా కలుపుకొని నిక్షేపంగా తినొచ్చు.

జీర్ణ సంబంధిత సమస్యలైన మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం పరగడుపున కొంత నెయ్యిని సేవిస్తే నెయ్యిలో పుష్కలంగా ఉన్న అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ జీర్ణాశయ సమస్యలను తొలగించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు ప్రతిరోజు ఆహారంలో నెయ్యిని తినిపిస్తే శారీరక మానసిక పెరుగుదలకు అవసరం విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ ఈ, అమినో ఆమ్లాలు , కాల్షియం ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా కంటిచూపు మెరుగు పడుతుంది, చర్మం పొడి వారకుండా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది, నాడీ తన వ్యవస్థ అభివృద్ధి జరిగి మెదడు చురుగ్గా పనిచేసే జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.