అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా తినేస్తున్నారా…. ఇది తెలుసుకోవాల్సిందే!

bananas-1354785_1920

రోజుకు ఒక్క అరటిపండు మన డైట్ లో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది అరటి పండు ఆరోగ్యానికి మంచిదని ఎడాపెడా తినేస్తుంటారు. అమృత మైన ఎక్కువగా సేవిస్తే విషయంగా మారుతుంది. అలాగే ఎన్నో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు మెండుగా ఉన్న అరటిపండును కూడా మోతాదుకు మించి తింటే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.చాలామందికి అరటిపండును ప్రతిరోజు తినే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం.

చాలామంది అరటి పండ్లను ఉదయం టిఫిన్ కంటే ముందే తినేస్తుంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తప్పంటున్నారు నిపుణులు.అరటి పండులో ఎక్కువగా ఉండే పొటాషియం మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం అంత సేయస్కారం కాదు. అరటి పండ్లను ఉదయం అల్పాహారం తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవడం మంచిది.రాత్రి సమయాల్లో అయితే నిద్రపోవడానికి గంట ముందే అరటి పండ్లను తినడం మంచిది.అరటి పండ్లలో షుగర్ లెవెల్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలి. ఇలాంటివారు వైద్య సలహా మేరకు మాత్రమే అరటిపండును తినడం మంచిది.

అరటిపండులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది తద్వారా మలబద్ధకం, అజీర్తి, గ్యాస్టిక్ వంటి సమస్యలు తొలగుతాయి.అయితే అరటి పండ్లను పాలు, పెరుగు వంటి అధిక కొవ్వు పదార్థాలతో కలిపి తింటే అజీర్తి, గ్యాస్ట్రిక్, విరోచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఉభసం, ఆస్మా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లను ఎక్కువగా తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా శీతాకాలం వర్షాకాలం సీజన్లలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను అస్సలు తినకపోవడమే మంచిది.