అల్లం ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటున్నారా… అయితే ఈ సమస్యలు తప్పవు!

healthy drinks for winter season

అల్లం మనం వంటలలో ఎక్కువగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి.అల్లం వంటలలో వేయటం వల్ల వంటకు మంచి రుచి రావడమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అల్లంలో ఉండే పోషక విలువలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే ఎలాంటి వ్యాధులు బారిన పడకుండా కాపాడుతాయి. ప్రతిరోజు ఒక కప్పు అల్లం టీ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనం దూరంగా ఉండవచ్చు.ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి అల్లం ఆరోగ్యానికి మంచిది అని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇలా మోతాదుకు మించి అల్లం తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. మరి మోతాదుకు మించి అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే..ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల నెలలు నిండకముందే ప్రసవం అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే శరీర బరువు తక్కువగా ఉంటారో అలాంటివారు అల్లం చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.

అల్లంలో ఉండే గుణాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే బరువు తక్కువగా ఉన్నవారు అల్లం తీసుకోవడం వల్ల మరింత శరీర బరువు తగ్గి ప్రమాదానికి గురవుతారు. అల్లం విరివిగా ఉపయోగించటం వల్ల అజీర్తి, గ్యాస్ ఏర్పడటం, కడుపులో మంట వంటి లక్షణాలు తలెత్తుతాయి. అందుకే వీలైనంత తక్కువ పరిమాణంలో అల్లం తీసుకున్నప్పుడే అందులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయని అంతకుమించి తీసుకోవటం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.