అందరికీ అందుబాటు ధరల్లో లభించే సపోటా పండు తినడానికి చాలా మధురంగా ఉండి మన శరీర పోషణకు అవసరమైన పోషకాలతో పాటు ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా సపోటా పండ్లలో విటమిన్ డి,సి,బీ 6,బీ12,కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్ ,క్యాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పోలేట్ ,ఫాస్ఫరస్ ,ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా లభ్యమవుతాయి కావున మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
సపోటా పండ్లలో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి అనేక రకాల వ్యాధులు నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు సపోటా పండును ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉండే సహజ పీచు పదార్థం మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసి మలబద్ధక సమస్యతో పాటు అన్ని రకాల జీర్ణ వ్యాధులను నయం చేస్తుంది.
సంతానలేని, అంగస్తంభన వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సపోటా పండులో తేనెను కలుపుకొని ఆహారంగా తీసుకుంటే వీరిలో టెస్టోస్టిరాన్ హర్మోన్ ఉత్పత్తికి చక్కగా సహాయపడుతుంది. అతి బరువు సమస్యతో బాధపడేవారు సపోటాను ఆహారంగా తీసుకుంటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు సమస్యను అధిగమించవచ్చు.
సపోటా పండులో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది కావున రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో సహాయపడి రక్తహీనత సమస్యను దూరం చేయడమే కాకుండా అలసట ,నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది.విటమిన్ ఏ, అధికంగా ఉంటుంది కావున కంటి సమస్యలు, చర్మ సమస్యలను దూరం చేస్తుంది. సపోటా బెరడును ఉడకబెట్టి కషాయంగా తాగితే వీటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను అదుపులో ఉంచుతుంది.