చక్కర వ్యాధి తలెత్తడానికి అసలు కారణమేంటో తెలుసా?

Mature Woman Doing Blood Sugar Test at home.

చక్కెర వ్యాధినే డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా చక్కర వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగించే అంశం అనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చక్కెర వ్యాధితో 60 శాతం జనాభా బాధపడుతున్నారు.
కొంత మందిలో చక్కెర వ్యాధి లక్షణాలు ఉన్నా వాటిని గుర్తించడానికి చాలా రోజులు పడుతుంది.
ఒకసారి వ్యాధి బారిన పడితే జీవిత కాలం మందులు వాడాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే వ్యాధి లక్షణాలను మొదట్లోనే గుర్తించగలిగితే కొంతవరకు అదుపు చేయవచ్చు. చక్కెర వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవడం సాధ్యం కాదు నియంత్రించుకోవడం ఒక్కటే మార్గం.

చక్కెర వ్యాధి లక్షణాలను పరిశీలించినట్లయితే ఒక్కొక్కరిలో ఒక విధంగా ఉండవచ్చు.చక్కర వ్యాధి ఎవరిలో వచ్చే ప్రమాదం ఉందో కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.చక్కెర వ్యాధి వంశపారంపర్యంగా కూడా కొందరిలో వచ్చే అవకాశం ఉంది.అలాకాకుండా ఇప్పుడు చెప్పబోయే లక్షణాలతో మీరు తరచూ బాధపడుతుంటే వెంటనే వైద్య సలహాలు తీసుకొని షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.హఠాత్తుగా బరువు తగ్గడం,కంటి చూపు మందగించడం, ఏవైనా గాయాలు అయినప్పుడు త్వరగా మానకపోవడం,కాళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, పళ్ళు ఊడిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

చక్కెర వ్యాధి రావడానికి కారణాలను పరిశీలిస్తే క్లోమ గ్రంధిలోని బీటా కణాలు తీవ్రస్థాయిలో పెరిగి రక్తంలోనీ గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. అంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరిగినప్పుడు దానిని అదుపు చేసే శక్తి, సామర్థ్యాలు మన శరీరం కోల్పోతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోస్ శాతం పెరిగి చక్కర వ్యాధికి దారి తీస్తుంది. మరో ముఖ్య కారణం ఒంట్లో శక్తిని ఖర్చు చేయకపోవడమే దీని ఫలితంగా ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయి చివరకు చక్కెర వ్యాధికి దారి తీయవచ్చు.