మొలకెత్తిన పల్లీలను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

పల్లీలను చలికాలంలో వేయించుకొని, మరియు ఉడకబెట్టుకొని తినటానికి ఎక్కువ మంది ఇష్టపడతారు.వేరుశెనగ గింజలని పల్లీలు అంటారు. పల్లీల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.
విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఖనిజ లవణాలతో పాటు అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా పల్లీల్లో లభించడం వల్ల వీటిని రోజువారి ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సకల ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పల్లీల్లో అత్యధిక ప్రోటీన్ లతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, ఈ సమృద్ధిగా లభిస్తాయి. పల్లీలను వేయించుకొని తినడం కన్నా మొలకెత్తిన పల్లీలను ఆహారంగా తీసుకుంటే అధిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అనేక సర్వేలో స్పష్టమైంది. మొలకెత్తిన పల్లీలను ఆహారంగా తీసుకున్నప్పుడు వీటిలో సమృద్ధిగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్, సహజ ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతోపాటు గుండె పనితీరును, రక్త ప్రసరణ వ్యవస్థను, నాడీ కణ వ్యవస్థను, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

పల్లీలతో బెల్లం చెక్కిలను తయారు చేస్తారు. వీటిని మన రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ సమృద్ధిగా అందుతుంది దాంతో ప్రమాదకర రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. పల్లీలు అత్యధికంగా విటమిన్ డి బెల్లంలో అధికంగా ఉన్న క్యాల్షియం ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది.పల్లీలు, బెల్లాన్ని కలిపి తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పల్లీల్లో పుష్కలంగా ఉన్న యాంటీ క్యాన్సర్ గుణాలు అనేక క్యాన్సర్ నుండి రక్షణ కలిగిస్తాయి. వీటిల్లో ఉన్న మంచి కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి అతి బరువు సమస్యను కూడా నివారిస్తాయి. అయితే షుగర్ పేషెంట్లు మాత్రం బెల్లంతో కలిపిన పల్లీలకు దూరంగా ఉండటమే మంచిది.